సర్వ సృష్టిలోని జీవ రాశి అంతా | Sarva srusti loni

Lyricist: Unknown


సర్వ సృష్టిలోని జీవ రాశి అంతా
నీదు మహిమనే ప్రస్తుతించగా
స్వరమెతి నీ మహిమ కార్యములను
ప్రతి స్థలమునందు ప్రకటించెదా
నీవే మార్గం నీవే సత్యం నీవే జీవం
నిన్న నేడు రేపు ఒకటిగ ఉన్నవాడవు
విడువవు ఎడబాయవు నా యేసయ్యా
|| సర్వ||

1.ఈపర్వత శిఖరాకాశం నీ అద్భుత కార్యములే
ఈ పచ్చిక భూమి నదులు నీ చేతి పనులే
నీవు లేనిదే ఏమి కలుగలేదు అది సంభూతుడా
నీవు ఉండగా నాకు భయము లేదు పరమ జయశాలి    ||నీవే||

2.నీ రూపములో నను చేసిన పరమ కుమ్మరీ 
నీ రక్తమునిచ్చ్చి జాలి హృదయమా
నీవు లేనిదే ఏమి కలుగ లేదు ఆది సంభూతుడా
నీవు ఉండగా నాకు భయము లేదు పరమ
జయశాలి         || నీవే||

Post a Comment

0 Comments