Lyricist: Percy Theresa
ఎంత మంచి దేవుడవయ్యా
ఎంత మంచి దేవుడవేసయ్యా
చింతలన్ని తీరేనయ్యా నిను చేరగా
ఎంత మంచి దేవుడవేసయ్యా (2)
|| ఎంత ||
1. ఘోరపాపినైన నేను దూరంగా పారిపోగా (2)
నీ ప్రేమతో నన్ను క్షమియించి
నను హత్తుకొన్నావయ్యా (2)
|| ఎంత ||
2. నాకున్న వారందరూ నను విడిచిపోయిననూ (2)
ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసిననూ
నను నీవు విడువలేదయ్యా (2)
|| ఎంత ||
3. నీవు లేకుండ నేనూ ఈ లోకంలో బ్రతికలేనయ్యా (2)
నీతో కూడ ఈ లోకం నుండీ
పరలోకం చేరెదనేసయ్యా (2)
|| ఎంత ||
0 Comments