ఎడబాయని నీ కృప | Yedabaayani nee krupa

Lyricist: Bro Mattew Krupa Ministries

ఎడబాయని నీ కృప
నను విడువదు ఎన్నటికీ (2)
యేసయ్యా నీ ప్రేమానురాగం
నను కాయును అనుక్షణం (2)
|| ఎడబాయని ||

1. శోకపు లోయలలో కష్టాల కడగండ్లలో
కడలేని కడలిలో నిరాశ నిసృహలో (2)
అర్ధమేకాని ఈ జీవితం
ఇక వ్యర్ధమని నేననుకొనగా (2)
కృపాకనికరముగల దేవా 
నా కష్టాల కడలిని దాటించితివి (2)
|| ఎడబాయని ||

2. విశ్వాస పోరాటములో ఎదురాయె శోధనలు
లోకాశల అలజడిలో సడలితి విశ్వాసములో (2)
దుష్టుల క్షేమమునే చూచి
ఇక నీతి  వ్యర్ధమని అనుకొనగా (2)
దీర్ఘశాంతముగల దేవా 
నా చేయి విడువక నడిపించితివి (2)
|| ఎడబాయని ||

3. నీ సేవలో ఎదురైన ఎన్నో సమస్యలలో
నా బలమును చూచుకొని నిరాశ చెందితిని (2)
భారమైన ఈ సేవను
ఇక చేయలేనని అనుకొనగా (2)
ప్రధాన యాజకుడా యేసు
నీ అనుభవలతో బలపరచితివి (2)
|| ఎడబాయని ||

Post a Comment

0 Comments