తేనే కన్న తీయనైనది | Thene kanna theeyanainadhi

Lyricist: Unknown

తేనే కన్న తీయనైనది
నా యేసు ప్రేమ మల్లే కన్న తెల్లనైనది (2)
నను ప్రేమించెను నను రక్షించెను
కష్టకాలమందు నాకు తోడైయుండెను (2)
|| తేనే కన్న ||

1. ఆగకనే సాగిపోదును
నా ప్రభువు చూపించు బాటలో (2)
అడ్డంకులన్నీ నన్ను చుట్టినా
నా దేవునినే విడువకుందును (2)
|| తేనే కన్న ||

2. నా వాళ్ళే నన్ను విడచినా 
నా బంధువులే దూరమైనా (2)
ఏ తోడు లేక ఒంటరినైనాను
నా తోడు క్రీస్తని ఆనందింతును (2)
|| తేనే కన్న ||

Post a Comment

0 Comments