వెండి బంగారాల కన్న మిన్న అయినది | Vendi Bangarala kanna


Lyricist: Akumarthi Daniel

వెండి బంగారాల కన్న మిన్న అయినది
యేసు ప్రేమ నా యేసు ప్రేమ (2)
లోక జ్ఞానమునకు మించిన ప్రేమ (2)
లోకస్థులు ఎవ్వరు చూపలేని ప్రేమ (2)  ||వెండి||

1.లోకమునకు వెలుగైన ప్రేమ 
లోకమును వెలిగించిన ప్రేమ (2)
లోకులకై కరిగిపోయిన ప్రేమ 
లోకాన్ని జయించిన ప్రేమ (2)
యేసు ప్రేమా శాశ్వత ప్రేమా (2)
హల్లెలూయా మహదానందమే(2)    ||వెండి||

2.ఏస్థితికైనా చాలిన ప్రేమ
నీ పరిస్థితిని మార్చగల ప్రేమ (2)
నీకు బదులు మరణించిన ప్రేమ
చిర జీవము నీ కొసగిన ప్రేమ (2)
యేసు ప్రేమా శాశ్వత ప్రేమా (2)
హల్లెలూయా మహదానందమే (2)  ||వెండి||


Post a Comment

0 Comments