Lyricist: Dr. Phillip P.Jacob
Album: Viduvani Yesu
గుండె నిండా యేసు ఉంటే కన్నీళ్లే ముత్యాలు
గుండె గుడిలో యేసు ఉంటే ధుఃఖమైనా సంతోషం (2)
గుండె నిండా నువ్వే
యేసు గుండె నిండా నువ్వే (4)
1. లోకస్నేహం వెలివేసిన
శోకంలో ముంచి వేసినా నీవే నా నేస్తం
నా హృదయం చెప్పేదొక్కటే
గుండె నిండా నువ్వే (2)
|| గుండె నిండా ||
2. ఊపిరంతా శాపమైనా
గాలి కూడ గేలిచేసినా నీవే నా చెలిమి
జాలి లేని ఇలలోన
నీవే నా కలిమి (2)
|| గుండె నిండా ||
3. చిరకాలం నీ ఒడిలో
ఉండాలని ఆశతో
చెమ్మగిల్లే కలలతోనే
పాడుతున్నా గీతం (2)
|| గుండె నిండా ||
0 Comments