ఎక్కడెక్కడో పుట్టి | Ekkadekkado putti


Lyricist: A R Stevenson

ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి (2)
చక్కనైన జంటగా ఇద్దరొక్కటగుటేమిటో

దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం (2)

1. ఒంటరి బ్రతుకును విడిచెదరు
ఒకరికొరకు ఒకరు బ్రతికెదరు
పెళ్లినాటి నుండి తల్లిదండ్రుల వదలి
భార్య భర్తలు హత్తుకొనుటేమిటో 
|| దేవుని సంకల్పం ||

2. గతకాల కీడంతా మరచెదరు
వీనులతో సంతసించెదరు (2)
పెళ్లినాటి నుండి ఒకరి కష్టం ఒకరు
ఇష్టముతో పంచుకొనుటేమిటో
|| దేవుని సంకల్పం ||

3. ఫలియించి భూమిని నింపెదరు
విస్తరించి వృద్ధి పొందెదరు (2)
పెళ్లినాటి నుండి మా కుటుంబం అంటూ
ప్రత్యేకముగా ఎంచుకొనుటేమిటో 
|| దేవుని సంకల్పం ||

Post a Comment

0 Comments