బంగారం అడుగలేదు | Bangaram adugaledhu


Lyricist: Raj Prakash Paul

బంగారం అడుగలేదు వజ్రాలు అడుగలేదు
హృదయాన్ని అడిగాడయ్యా
ఆస్తులను అడుగలేదు అంతస్తులు అడుగలేదు
హృదయాన్ని అడిగాడయ్యా (2)

మనుషులను చేసాడయ్యా
ఈ లోకాన్ని ఇచ్చాడయ్యా (2)
నే వెదకి రాలేనని నా కోసం వచ్చాడయ్యా 

నా యేసయ్యా... నా యేసయ్యా...
నా యేసయ్యా... నా యేసయ్యా...
|| బంగారం ||

1. పాపాన్ని తొలగించి శాపాన్ని విరిచేయ భూలోకం వచ్చాడయ్యా
మానవుని రక్షించి పరలోకము చేర్చ సిలువను మోసాడయ్యా (2)
కన్నీటిని తుడిచాడయ్యా సంతోషం పంచాడయ్యా (2)
|| నా యేసయ్యా ||

2. రక్షణను అందించి రక్తాన్ని చిందించి 
మోక్షాన్ని ఇచ్చాడయ్యా
ధనవంతులుగా మనలను చేయ దారిద్ర్యమొందాడయ్యా (2)
కన్నీటిని తుడిచాడయ్యా సంతోషం పంచాడయ్యా (2)
|| నా యేసయ్యా ||

Post a Comment

0 Comments