Lyricist: Unknown
దేవా మా కుటుంబము
నీ సేవకే అంకితము (2)
ఈ శాప లోకాన నీ సాక్షులుగా నిలువ
నీ ఆత్మతో నింపుమా (2)
|| దేవా ||
1. కాపరి మా యేసు ప్రభువే కొదువేమి లేదు మాకు
మాకేమి భయము మాకేమి దిగులు
నీకే వందనములయ్యా
లోబడి జీవింతుము లోపంబులు సవరించుము
లోకాశలు వీడి లోకంబులోనా నీ మందగా ఉందుము
|| దేవా ||
2. సమృద్ధి జీవంబును సమృద్ధిగా మాకిమ్ము
నెమ్మదిగల ఇల్లు నిమ్మళమగు మనస్సు
ఇమ్మహిలో మాకిమ్మయ్యా
ఇమ్ముగా దయచేయుము గిన్నె నిండిన అనుభవము
ఎన్నో కుటుంబాల ధన్యులుగా జేయంగా మమ్ములను బలపరచుము
|| దేవా ||
3. ఏ కీడు రాకుండగా కాపడుము మా పిల్లలను
లోక దురు వ్యసనంలా తాకుడు లేకుండా
దాచుము నీ చేతులలో
ఒలీవ మొక్కల వలెను ద్రాక్ష తీగెలను పోలి
ఫలసంపదలతోను కలకాలము జీవించ
కురిపించుము నీ దీవెనలన్
|| దేవా ||
4. పెంపారు జేయుము మాలో సొంపుగ నీ ఘన ప్రేమన్
నింపుమా హృదయములు శాంతి భాగ్యంబులతో
సంతసంబుగ సాగెదము
వింతైన నీ ప్రేమను అంతట ప్రకటింతుము
కొంతకాలమే మేము ఉందుము లోకాన
చెంత చేరగ కోరెదము
నీ చెంత చేరగ కోరెదము
|| దేవా ||
0 Comments