దయగల యేసయ్య నీతో నడిచెదను (2)
నా జీవితకాలము పాటలు పాడెదను
నా బ్రతుకు దినమంతా ఆరాధించెద (2)
||కృప కలిగిన||
1.నా బ్రతుకు బాటను నీ వేసావే
ఆ మంచి మార్గంలో నన్ను నిలిపావు(2)
ఆరిన నేలకు సెలయేరువు నీవు
నా దారికి రహదారివై నా ముందున్నావు (2)
పాటలు పాడెదను నా జీవితకాలము
ఆరాధించెద నా బ్రతుకు దినములు (2)
||కృప కలిగిన||
2.చేయలేనన్న సేవకు పిలిపిచ్ఛావే
ఆ పరిచర్యకు వెలిగించావు(2)
సన్నిధిలో సహవాసంలో నన్ను ఉంచావు
సంఘములో సేవకునిగా నను మార్చావు(2)
పాటలు పాడెదను నా జీవితకాలము
ఆరాధించెద నా బ్రతకు దినములు (2)
||కృప కలిగిన||
3.పోయినన్న ప్రాణాన్ని తిరిగిచ్చావే
బ్రతకనన్న ఆశను బ్రతికించావు (2)
నీవు ఇచ్చిన ఈ ఊపిరి నీకే అంకితము
నీవు ఇచ్చిన ఈ దేహము నీకే సొంతం అయ్యా (2)
పాటలు పాడెదను నా జీవితకాలము
ఆరాధించెద నా బ్రతకు దినములు (2)
||కృప కలిగిన||
0 Comments