ప్రేమ అన్నిటిలో శ్రేష్టము (2)
1. ప్రేమ విలువను సిలువ జూపె
ప్రేమ ఎట్టిదో ప్రభువు నేర్పె (2)
ప్రేమ చూపు నరుల యెడల
ప్రేమ కలిగియుండు ప్రియుడా
||ప్రేమ||
2. ప్రేమలో దీర్ఘశాంతము
ప్రేమలో దయాళత్వము (2)
ప్రేమ సహింప నేర్పును
ప్రేమ కలిగియుండు ప్రియుడా
||ప్రేమ||
3. ప్రేమలో డంబముండదు
ప్రేమ ఉప్పొంగదెప్పుడు (2)
ప్రేమలో తగ్గింపున్నది
ప్రేమ కలిగియుండుప్రియుడా
||ప్రేమ||
4. ప్రేమించు సహొదరుని
ప్రార్ధించు శత్రువుకై (2)
ప్రేమయేసుని మనస్సు
ప్రేమ కలిగియుండు ప్రియుడా
|| ప్రేమ ||
5. ప్రేమలో సత్యమున్నది
ప్రేమ సంతోషమిచ్చును (2)
ప్రేమయే సమాధానము
ప్రేమ కలిగియుండు ప్రియుడా
|| ప్రేమ||
6. విశ్వాసము నిరిక్షణ
ప్రేమ ఈ మూడు నిలచున్ (2)
వీటిలో శ్రేష్టమైనది
ప్రేమ యే ప్రేమ
|| ప్రేమ ||
0 Comments