ఇది కోతకు సమయం | idhi kothaku samayam

Lyricist: unknown 
Album: Andhra Kraistava Keerthanalu


ఇది కోతకు సమయం 
పనివారి తరుణం ప్రార్ధన చేయుదమా (2)
పైరును చూచెదమా పంటను కోయుదమా (2)
||ఇది కోతకు||

1.కోతెంతో విస్తారమాయెనే
కొసేటి పనివారు కొదువాయెనే (2)
ప్రియయేసు నిధులన్ని నిలువాయెనే (2)
||ఇది కోతకు||

2.సంఘమా మౌనము దాల్చకుమా
కోసెడి పనిలోన పాల్గొందమా (2)
యజమాని నిధులన్ని మీకే కదా (2)
||ఇది కొతకు||

3.శ్రమలేని ఫలితంబు మీకీయగా
వలదంచు వెనుదీసి విడిపోదువా (2)
జీవార్ధ ఫలములను భుజియింపవా (2) 
|| ఇది కోతకు ||

Post a Comment

0 Comments