కోతకు వేళాయెగా నీతి ఫలములియ్యగా (2)
|| పరమ ||
1.పరిశుద్ధ స్ధలము నందునా
పారు జీవనదుల చెంతనా
నాటబడి యున్నచో పరిపక్వ మౌదువు
నీ దేవుని మందిరాన నిరతము జీవింతువు
|| పరమ ||
2.సారవంతమైన పోలములో
రాళ్ళు ఏరియున్న నేలలో
ముండ్ల గెత్స పొదలు నరికియున్న తోటలో
ముదమారగ పరమ తండ్రి నిన్ను పెంచె గనుమా
|| పరమ ||
3.నిద్రించుచున్న సంఘమా
నీ చీకటి ప్రారద్రోలుమా
క్రీస్తు వెలుగు నీపై ప్రసరింప నీయుమా
నిత్య సత్యముల వెలుగు ఫలములు నందీయుమా
||పరమ||
4.నిరాశను విడిచి పెట్టుమా
కృపా సాగరమున చేరుమా
విశ్వాస ప్రేమలను కవచముగా ధరించుమా
నీతి రాజు యేసు తోడ నిరతము జీవించుమా
|| పరమ ||
0 Comments