భారత దేశపు క్రీస్తు సంఘమా | Bharata desapu kreesthu sanghama

Lyricist: D.S. Wesley
Album: Bharati
singers: S.P Balasubramanyam, S.P Sailaja


భారత దేశపు క్రీస్తు సంఘమా భువి దివి సంఘమా
ధర సాతానుని రాజ్యము కూల్చే యుద్ధరంగమా (2)
 
1.ఎవని పంపుదును నా తరపున ఇల ఎవరు పోవుదురు నాకై (2)
నేనున్నాను నన్ను పంపుమని రమ్ము సంఘమా
భారత దేశములో వెలిగే-క్రీస్తు సంఘమా (2)
|| భారత || 

2.అడవి ప్రాంతములు ఎడారి భూములు
ద్వీపవాసులను కనుమా (2)
అంధకార ప్రాంతముల ప్రభుని జ్యోతిని
వెలిగింప చనుమా (2)
భారత దేశములో వెలిగే క్రీస్తు సంఘమా (2)
|| భారత ||

3.బ్రతుకులోన ప్రభు శక్తిలేని క్రైస్తవ జనాంగమున
కనుమా (2)
కునుకు దివ్వెలను సరిచేయగ ఉజ్జీవ జ్వాలగొని 
చనుమా (2)
భారత దేశములో వెలిగే క్రీస్తు సంఘమా (2)
|| భారత ||

Post a Comment

0 Comments