Album: Andhra Kraisthava Keerthanalu
ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ
మరణము కంటె బలమైన ప్రేమది
నన్ను జయించె నీ ప్రేమ (2)
|| ఆశ్చర్యమైన ||
1. పరమును విడిచిన ప్రేమ ధరలో పాపిని వెదికిన ప్రేమ (2)
నన్ను కరుణించి ఆదరించి సేదదీర్చి నిత్యజీవమిచ్చే (2)
|| ఆశ్చర్యమైన ||
2. పావన యేసుని ప్రేమ సిలువలో పాపిని మోసిన ప్రేమ (2)
నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి తన మహిమానిచ్చే (2)
|| ఆశ్చర్యమైన ||
3. నా స్ధితి జూచిన ప్రేమ నాపై జాలిని జూపిన ప్రేమ (2)
విడనాడని ప్రేమది ఎన్నడు ఎడబాయనిది (2)
|| ఆశ్చర్యమైన ||
4. శ్రమలు సహించిన ప్రేమ నాకై శాపము నోర్చిన ప్రేమ (2)
నాకై పరుగెత్తి కౌగిలించి ముద్దాడి కన్నీటిని తుడిచే (2)
|| ఆశ్చర్యమైన ||
#Worship2026
#ChristianMusic2026
#NewWorshipSongs2026
#BestChristianSongs2026
#TopWorshipSongs2026
0 Comments