ఓ యేసు నీ ప్రేమ | Oo yesu nee prema |

ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహనీయము
ఆకాశ తార పర్వత సముద్ర ములకన్న గొప్పది (2)
|| ఓ యేసు ||

1. ఎనలేని ఆనందమే హృదయము నిండెను
ప్రభూ నీ కార్యములు గంభీరమైనవి
ప్రతి ఉదయ సాయంత్రములు స్తుతికి యోగ్యములు (2)
|| ఓ యేసు ||

2. మరణాంధకారపు లోయలో సంచరించినన్
నిరంతరం నీవు నాదు కాపరివై
నన్ను గాయచు నడుపుము దేవ కరుణ గల ప్రభువా!!  (2)
|| ఓ యేసు ||

3. కొదులెన్ని యున్నా భయపడను నేనెపుడు
ఆత్మ సంబంధముగా సేద దీర్చు ప్రభువా
భోజన జలములతో తృప్తిపరచు నాతో నుండునేసు (2)
|| ఓ యేసు ||

4. దేవుని గృహములో సదా స్తుతించెదను
సంపూర్ణ హృదయముతో సదా స్తుతించెదను
స్తుతి ప్రశంసలకు యోగ్యుడవు
హల్లేలూయా ఆమేన్ (2)
|| ఓ యేసు ||


#Worship2026
#ChristianMusic2026
#NewWorshipSongs2026
#BestChristianSongs2026
#TopWorshipSongs2026

Post a Comment

0 Comments