ఓ సంఘమా సర్వాంగమా పరలోక రాజ్యపు ప్రతిబింబమా
యేసయ్యాను ఎదుర్కొనగా నీతి నలంకరించి
సిద్ధపడుమా
ఓ సంఘమా వినుమా
1. క్రీస్తే నిన్ను ప్రేమించెనని తన ప్రాణము నర్పించెనని
స్వస్ధపరిచె నిర్ధోషముగా ముడత కళంకము లేనిదిగా
మహిమ యుక్తముగా నిలుపగోరె యేసువా (2)
సహింతువా తీర్పునాడు (2)
|| ఓ సంఘమా ||
2. చీకటిలో నుండి వెలుగునకు లోకములో నుండి వెలుపలకు
శ్రీ కర్త గుణాతిశయములను ప్రకటించుటకే
పిలిచెనని
గుర్తించు చుంటివా క్రియలను గంటివా (2)
సజీవముగా నున్నావా (2)
|| ఓ సంఘమా ||
3. చల్లగానైన వెచ్చగను నుండిన నీకది మేలగును
నులివెచ్చని స్థితి నీకుండిన బయటకు ఊమ్మివేయబడుదువేమో
నీ మనస్సు మార్చుకో తొలి ప్రేమ కూర్చుకో (2)
ఆసక్తి తోడనుండుమా (2)
|| ఓ సంఘమా ||
4. కడపటి బూర మ్రోగగనే కనురెప్పపాటున
మారుదువా
వడిగా మేఘాసీనుడవై ప్రభు చెంతకు నీవు పోగలవా?
గొర్రెపిల్ల సంఘమా క్రీస్తురాజు సంఘమా (2)
రారాజు నెదుర్కొనగలవా (2)
|| ఓ సంఘమా ||
#Worship2026
#ChristianMusic2026
#NewWorshipSongs2026
#BestChristianSongs2026
#TopWorshipSongs2026
0 Comments