నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే
నీ శ్రేష్ఠ భాగము నీయ వెనుదీతువా...
వెనుదీతువా (2)
1. ధరలోని ధనధాన్యముల నీయగా
కరుణించి కాపాడి రక్షింపగా (2)
పరలోక నాధుండు నీ కీయగా
మరి యేసు కొరకీయ వెనుదీతువా
|| నీ ధనము ||
2. కలిగించె సకలంబు సమృద్ధిగా
తొలగించె పలు బాధ భరితంబులు
బలియాయే నీ పాపముల కేసుడే
చెలువంగ ప్రభుకీయ చింతింతువా
|| నీ ధనము ||
3. వెలుగు నీడలు గాలి వర్షంబులు
కలిగించె ప్రభు నీకు ఉచితంబుగా
వెలిగించ ధరపైని ప్రభు నామమును
కలిమికొలది ప్రభున కర్పింపవా
|| నీ ధనము ||
#Worship2026
#ChristianMusic2026
#NewWorshipSongs2026
#BestChristianSongs2026
#TopWorshipSongs2026
0 Comments