యెహోవా నా బలమా | Yehova naa balamaa

Lyricist: Bro. G. John 
Album: yehova na balama 
Music director: JK Christopher


యెహోవా నా బలమా-యదార్ధమైనది నీ మార్గం
పరిపూర్ణమైనది-నీ మార్గం-యెహోవా...

1.నాశత్రువులు-నను చుట్టినను
నరకపు పాశము-లరికట్టినను (2)
వరదవలె భక్తి-హినులు పొర్లిన
విడువక నను -ఎడబాయని దేవా (2) 
||యెహోవా||

2.దయగలవారిపై దయ -చూపించును
కఠినుల యెడల-వికటము జుపును (2)
గర్విష్టుల యొక్క గర్వము-నణుచును
సర్వము నెరిగిన-సర్వాధికారి (2)
||యెహోవా||

3.మరణపుటురులలో -మరువక మొరలిడ
ఉన్నత దుర్గమై -రక్షణ శృంగమై (2)
తన యాలయములో నా మొరవినెను
అదరెను ధరణి-భయకంపముచే (2) 
||యెహోవా||

4.పౌరుషముగల-ప్రభు కొపింపగ
పర్వతముల-పునాదులు వణకెను (2)
తన నోట నుండి-వచ్చిన అగ్ని
దహించి వేసెను-వైరుల నెల్లన్ (2) 
||యెహోవా||

5.మేఘములపై -ఆయన వచ్చును
మేఘములను-తన మాటుగ జేయును (2)
ఉరుములు మెరుపులు-మెండుగ జేసి
అపజయమిచ్చును-అపవాదికిని (2)
||యెహోవా||

6.నా దీపమును -వెలిగించువాడు
నా చీకటిని-వెలుగుగా జేయును (2)
జలరాసులనుండి - బలమైన చేతితో
వెలుపల జేర్చిన-బలమైన దేవుడు (2) 
||యెహోవా||

7.నా కళ్ళను -లేడి కాళ్లగ జేసి
ఎతైన స్ధలములో -శక్తితో నిలిపి (2)
రక్షణ కేడము -నాకందంచి
అక్షయముగ తన-పక్షము జేర్చిన (2) 
||యెహోవా||

8.యెహోవా-జీవము గల దేవా
బహుగా స్తుతులకు-అర్హుడ నీవు (2)
అన్యజనులలో -ధన్యత చూపుచు
హల్లెలూయ స్తుతి-గానము జేసెద (2)
|| యెహోవా||

Post a Comment

0 Comments