గతకాలమంత నీ నీడలోన | Gathakaalamantha nee needalona



గతకాలమంత నీ నీడలోన 
దాచావు దేవా వందనం
కృప చూపినావు కాపాడినావు
ఎలా తీర్చగలను నీ ఋణం
పాడనా నీ కీర్తన - పొగడన వేనోళ్ళన (2)

వందనం యేసయ్య - ఘనుడవు నీవయ్యా (2)
|| గతకాలమంత ||

1. ఎన్నెనో అవమానాలెదురైనను
నీ ప్రేమ నన్ను విడిచి పోలేదయ్యా
ఇక్కట్లతో నేను కృంగినను
నీ చేయి నను తాకి లేపెనయ్యా
నిజమైన నీ ప్రేమ నిష్కలంకము 
నీవిచ్చు హస్తము నిండు ధైర్యము (2)
వందనం యేసయ్యా - ఘనుడవు నీవయ్యా (2)
|| గతకాలమంత ||

2. మాటలే ముల్లుగా మారిన వేళ
నీ మాట నన్ను పలకరించేనయ
నిందలతో నేను నిండిన వేళ
నీ దక్షిన హస్తం నన్ను తాకేనయ
నీ మాట చక్కటి జీవపు ఊట
మరువనేన్నడు నిన్ను స్తుతియించుట (2)
వందనం యేసయ్య - ఘనుడవు నీవయ్యా (2)
|| గతకాలమంత ||



#Worship2026
#ChristianMusic2026
#NewWorshipSongs2026
#BestChristianSongs2026
#TopWorshipSongs2026

Post a Comment

0 Comments