Lyricist: Bro Yesanna Hosanna ministries
Album: Daya Kireetam
జుంటె తేనే ధారలకన్న
యేసు నామమే మధురం
యేసయ్య సన్నిధినే మరువజాలను (2)
జీవితకాలమంతా ఆనందించెదా
యేసయ్యానే ఆరాధించెదా (2)
1 యేసయ్య నామమే బహుపూజనీయను
నాపై ద్రుష్టి నిలిపి సంత్రుష్టిగా నను ఉంచి (2)
నన్నెంతగానో దీవించి
జీవజలపు ఊటలతో ఉజ్జీవింపజేసెనే (2)
|| జుంటె తేనే ||
2. యేసయ్యా నామమే బలమైన దుర్గము
నా తోడై నిలిచి క్షేమముగా నను దాచి (2)
నన్నెంతగానో కరుణించి
పవిత్ర లేఖనాలతో ఉత్తేజింపజేసెనే (2)
|| జుంటె తేనే ||
3. యేసయ్యా నామమే పరిమళ తైలము
నాలో నివసించే సువాసనగా నను మార్చి (2)
నన్నెంతగానో ప్రేమించి
విజయోత్సవాలతో ఊరేగింపజేసెనే (2)
|| జుంటె తేనే ||
0 Comments