కమ్మని బహుకమ్మని | Kammani bahukammani | New telugu christian songs




కమ్మని బహుకమ్మని చల్లని అతి చల్లని
తెల్లని తేట తెల్లని యేసు నీ ప్రేమామృతం (2)

జుంటె తేనె కన్న మధురం సర్వ జనులకు సుకృతం (2)
యేసు నీ ప్రేమామృతం (2)
|| కమ్మని ||

1. ఆశ చూపెను ఈ లోకం
మలినమాయెను నా జీవితం
యేసు నీదు ప్రేమ దయ చూపెను ఈ దీనురాలిపైన (2)
వెలిగెను నాలో నీ ఆత్మ దీపము (2)
కడిగిన ముత్యముగా అయ్యాను నేను (2)
|| కమ్మని ||

2. నా కురులతో పరిమళమ్ములతో చేసెద నీదు పాద సేవ
నా గుండె గుడిలో కొలువైయున్న నీకు చేసెద నేను మధుర సేవ (2)
ఆరాధింతును నిన్ను అనుదినము (2)
జీవింతును నీకై అనుక్షణము (2)
|| కమ్మని ||


#Worship2026
#ChristianMusic2026
#NewWorshipSongs2026
#BestChristianSongs2026
#TopWorshipSongs2026

Post a Comment

0 Comments