Album: Kannerelamma
కన్నీరేలమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా
కలవరపడకమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా
కరుణ చూపి కలత
యేసే తోడమ్మా
|| కన్నీరేలమ్మా ||
1. నీకేమి లేదని ఏమి తేలేదని
అన్నారా నిన్ను అవమాన పరిచారా
తలరాత ఇంతేనని తర్వాత ఏమౌనోనని
రేపటిని గూర్చి చింతించుచున్నావా
చింతించకన్న యేసు మాటలు మరిచావా
మారాను మధురంగా మార్చేను చూసావా (2)
|| కన్నీరేలమ్మా ||
2. నీకెవరు లేరని ఏం చేయలేవని
అన్నారా నిన్ను నిరాశాపరిచారా
పొరుగంటివాడనని ఎప్పటికి ఇంతేనని
నా బ్రతుకు మారదని అనుకుంటూ ఉన్నావా
నేనున్నానన్న యేసు మాటలు మరిచావా
కన్నీరు నాట్యంగా మార్చును చూస్తావా (2)
|| కన్నీరేలమ్మా ||
#Worship2026
#ChristianMusic2026
#NewWorshipSongs2026
#BestChristianSongs2026
#TopWorshipSongs2026
0 Comments