నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము
దేవా ఈ భువిని వీడు గడియ నాకు చూపుము
ఇంకొంత కాలము ఆయుష్షు పెంచుము
నా బ్రతుకు మార్చుకొందును సమయమునిమ్ము
|| నా బ్రతుకు ||
1. ఎన్నో సంవత్సరాలు నన్ను దాటిపోవుచున్మవి
నా ఆశలు నా కలలనే వెంబడించుచుంటివి
ఫలాలు లేని వృషమువలె ఎదిగిపోతిని
ఏనాడు కూలిపోదునో ఎరుగకుంటిని
నా మరణ రోదన ఆలకించుమో ప్రభు
మరల నన్ను నూతనముగ చిగురు వేయని
|| నా బ్రతుకు ||
2. నీ పిలుపు నేను మరచితి నా పరుగులో నేనలసితి
నా స్వార్ధము నా పాపము పతన స్థితికి చేర్చెను
నా అంతమెటుల నుండునో భయము పుట్టుచున్నది
దేవా నన్ను మన్నించుము
నా బ్రతుకు మార్చుము
యేసూ నీ చేతికి ఇక లొంగిపోదును
విశేషముగా రూపించుము నా శేష జీవితం
|| నా బ్రతుకు ||
#Worship2026
#ChristianMusic2026
#NewWorshipSongs2026
#BestChristianSongs2026
#TopWorshipSongs2026
0 Comments