నడిపిస్తాడు నా దేవుడు
శ్రమలోనైన నన్ను విడువడు(2)
అడుగులు తడబడినా_అలసట పైబడినా
చేయి పట్టి వెన్నుతట్టి చక్కని ఆలోచన చెప్పి (2)
||నడిపిస్తాడు||
1. అంధకారమే దారి మూసినా-నిందలే నను కృంగదీసినా (2)
తన చిత్తం నెరవెర్చుతాడు గమ్యం వరకు నను చెర్చుతాడు (2)
||నడిపిస్తాడు||
2.కష్టాల కొలిమి కాల్చివేసినా-శోకాలు గుండెను చీల్చివేసినా (2)
తన చిత్తం నెరవెర్చుతాడు గమ్యం వరకు నను చెర్చుతాడు (2)
|| నడిపిస్తాడు||
3.నాకున్న కలిమి కరిగిపొయిన-నాకున్న బలిమి
తరిగిపోయిన (2)
తన చిత్తం నెరవెర్చుతాడు గమ్యం వరకు నను చెర్చుతాడు (2)
||నడిపిస్తాడు||
0 Comments