సేవకులారా సువార్తికులారా
యేసయ్య కోరుకున్న శ్రామికులారా
సేవకులారా సువార్తికులారా
మీ మాదిరికై వందనము
ఉన్నత పనికై మమ్మును పిలచిన దేవా
మా కొరకై నీ ప్రాణం అర్పించితివి
నీలో నిలిచి యుండుటే మా భాగ్యము
నీ కొరకై జీవించెదము
|| సేవకులారా ||
1. దైవాజ్ఞను నెరవేర్చుటకు మాకోసం బలి అయ్యారు
ప్రభు రాజ్యం ప్రకటించుటకు ప్రాణలని ఇల విరిచారు
మా ఆత్మలు రక్షించుటకు హత సాక్షులు మీరయ్యారు
నీతి కిరీటం పోదుటకు అర్హులుగా మీరున్నారు
|| ఉన్నత ||
2. సంఘమును కాపాడుటలో కాపరులుగ మీరున్నారు
సువార్తకై పోరాడుటలో సిద్దపడిన సైన్యం మీరు
మీ ప్రేమను ఎరుగని వారు అన్యాయముగ మిము చంపారు
మీ త్యాగం మేము ఎన్నటికీ మరచిపోము
|| సేవకులారా ||
3. సువార్తను అందించుటకు ఎన్నో హింసలు పొందారు
ఆకలితో మోకాళ్లూని సంఘమును పోషించారు
మాకు మాదిరి చూపించుటకు క్రీస్తుని పోలి జీవించారు
మీ జత పని వారమే మేము మీ జాడలో ఇక నిలిచెదము
||ఉన్నత ||
#Worship2026
#ChristianMusic2026
#NewWorshipSongs2026
#BestChristianSongs2026
#TopWorshipSongs2026
0 Comments