నేనెల్లప్పుడు యెహోవను సన్నుతించెదన్
నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్ -(2)
అంతా నా మేలుకే - ఆరధనా యేసుకే
అంతా నా మంచికే-తన చిత్తమునకు తల వంచితే(2)
ఆరధనా ఆపను-స్తుతియించుట మానను-(2)
స్తుతియించుట మానను
|| అంతా నా ||
1.కన్నీల్లే పానములైన-కఠిన దు:ఖ బాధలైన
స్థితిగతులే మారిన-అవకాశం చేజారిన
మారదు యేసు ప్రేమ-నిత్యుడైన తండ్రి ప్రేమ-(2)
మారదు యేసు ప్రేమ-నిత్యుడైన తండ్రి ప్రేమ-(2)
|| అంతా నా ||
2.ఆస్తులన్ని కోల్పొయిన -కన్నవారే కునుమరుగైన
ఊపిరి బరువైన-గుండెలే పగిలినా
యెహొవా యిచెను-యెహొవా తీసికొనెను-(2)
ఆయన నామమునకే -స్తుతి కలుగు గాక (2)
|| అంతా నా ||
3.అవమానం ఎంతైన-నా వారే కాదన్న
నీవు తప్ప ఎవరున్నారు ఆకాశమందున్నా (2)
నీవు నా కుండగా-ఏది నాకక్కర లేదు (4)
|| అంతా నా ||
4.సంకల్పన పిలుపొంది-నిన్నే ప్రేమించు నాకు
సమస్తము సమకూడి-మేలుకై జరుగును(2)
యేసుని సారుప్యము నేను పొందాలని (2)
అనుమతించిన ఈ విలువైన సిలువకై(2)
|| అంతా నా||
5.నీవు చెయునది-నాకిప్పుడు తెలియదు
ఇక మిదట నేను-తెలిసికొందును(2)
ప్రస్తుతము సమస్తము-దు:ఖ కరమే(2)
అభ్యసించిన నీతి-సమాధాన ఫలమే(2)
|| అంతా నా ||
#Worship2026
#ChristianMusic2026
#NewWorshipSongs2026
#BestChristianSongs2026
#TopWorshipSongs2026
0 Comments