నీ కృపాతిశయమును | Nee Krupa athisayamunu anunithyamu



నీ కృపాతిశయమును అనునిత్యము (2)
నే కీర్తించెదా తరతరములకు
నీ విశ్వాస్యతను నే ప్రచురింతును

నీ కృపా నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది (2)
మౌనిగా ఎటులుండెదా సాక్షిగా ప్రచురించకా
నా తుది శ్వాస వరకు నీ చెంతా చేరేవరకు (2)

1. ఇంకా బ్రతికి ఉన్నామంటే కేవలము నీ కృపా
ఇంకా సేవలో ఉన్నామంటే కేవలము నీ కృపా
ఏ మంచితనము లేకున్ననూ (2)
కొనసాగించినది నీ కృపా నిలబెట్టుకున్నది నీ కృపా 
|| నీ కృపా ||

   " పది తరములుగా వెంటాడిన మొయాబు శాపము 
నీ కృపను శరణు వేడగ మార్చే నే వెయి తరములు
అన్యురాలైన ఆ రూతును ధన్యురాలుగా మార్చినది 
నీ కృపయే నను దీవించగా
ఏ శాపము నాపై పనిచెయదు "
|| నీ కృపా ||

2. ఆరోగ్యం ఉద్యోగం ఉన్నాయంటే కేవలము నీ కృపా
మెతుకు బ్రతుకు ఉన్నాయంటే కేవలము నీ కృపా
కృపతోనే రక్షణనిచ్చావు నా క్రియల వలన కానే కాదు
జీవితమంత ఋణస్థుడను
నీయందె నిత్యము అతిశయము 
|| నీ కృపా ||

3. ఇల్లు వాహనం ఉన్నాయంటే నీదు కృపాదానమే
బలము ధనము ఉన్నాయంటే నీదు కృపాదానం
ఏ అర్హత నాలో లేకున్ననూ కృపా భిక్షయే నా యెడల
జీవితమంత కృతజ్ఞడను
జీవితంతా పాడెదను
|| నీ కృపా ||

4.ప్రియులే నన్ను విడనాడినా శోకమే నా లోకమా
అనాధగానే మిగిలానే నా కధ ముగిసినదే
నీ కుడి చేతిలో ఉంచగనే బెన్యామీను వంతుగా మారే
ఐదంతలాయే నా భాగ్యము
విదిరాతనే మార్చెనే నీ కృపా
|| నీ కృపా || 


#Worship2026
#ChristianMusic2026
#NewWorshipSongs2026
#BestChristianSongs2026
#TopWorshipSongs2026





Post a Comment

0 Comments