నీలోనే ఆనందం నా దేవా - నీలోనే నాకు జీవం
నిన్న నేడు నిరంతరం మారని దేవా (2)
ఈ లోకమంతా నేను వెదకినా నాకు లేదయ్యా ఎక్కడా ఆనందం
నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపిన నా హృదయం పొంగెను (2)
1. ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నాను
ఏది నా సొంతం కాదనుకున్నాను (2)
తప్పిపోయిన కుమారుని నేనైతే
నా కొరకై నిరీక్షించే తండ్రి నా యేసూ (2)
|| ఈ లోకమంతా ||
2. ఏ ప్రేమ నీ ప్రేమకు సాటిరాదయ్యా (2)
ఎన్ని ఉన్నా నీతో సరియెదికాదయ్యా
నన్ను మరువని ప్రేమ నీదయ్యా
నన్ను మార్చుకున్న ప్రేమా నీదే యేసయ్యా (2)
|| ఈ లోకమంతా ||
#Worship2026
#ChristianMusic2026
#NewWorshipSongs2026
#BestChristianSongs2026
#TopWorshipSongs2026
0 Comments