నీతో ఉంటే జీవతం | Neetho unte Jeevitham | Enosh Kumar

నీతో ఉంటే జీవతం వేదనైన రంగుల పయనం
నీతో ఉంటే జీవితం బాటేదైన పువ్వుల కుసుమం (2)

నువ్వే నా ప్రాణాధారము
నువ్వే నా జీవాధారము...(2)

1.నువ్వే లేకపోతే నేను జీవించలేను
నువ్వే లేకపోతే నేను బ్రతుకలేను
నువ్వే లేకపోతే నేను ఊహించలేను
నువ్వే లేకపోతే నేను లేనేలేను (2)
నిను విడిచిన క్షణమే ఒక యుగమై గడిచె నా జీవితము
చెదరిన నా బ్రతుకే నిన్ను వెతికే నీ తోడు కోసం (2)
|| నువ్వే నా ప్రాణాధారము ||

2. నీతో నేను జీవిస్తానే కలకాలము
నిన్నే నేను ప్రేమిస్తానే చిరకాలము
లోకంలోనే ఎన్నో వెతికా అంతా శూన్యము
చివరికి నువ్వే నిలిచావే సదాకాలము (2)
నిను విడువను దేవా నా ప్రభువా నా ప్రాణనాధా
నీ చేతితో మలచి నను విరచి సరిచెయునాధా (2)
|| నువ్వే నా ప్రాణాధారము ||


#Worship2026
#ChristianMusic2026
#NewWorshipSongs2026
#BestChristianSongs2026
#TopWorshipSongs2026

Post a Comment

0 Comments