నీ వాక్యమే నన్ను బ్రతికించెను
బాధలలో నెమ్మదినిచ్చెను(2)
కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా వాక్యమై
యున్న యేసు వందనమయ్యా(2)
||నీ వాక్యమే||
1.జిగటగల ఊబినుండి-లేవనెతైను
సమతలమగు బండపై-నన్ను నిలిపెను(2)
నా పాదములకు-దీపమాయెను
సత్యమైన మార్గములో -నడుపుచుండెను(2)
||నీ వాక్యమే||
2.శత్రువులను ఎదుర్కొనే-సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధమనసు నిచ్చుచున్నది(2)
అపవాది వేయుచున్న -అగ్ని బాణములను
ఖడ్గమువలె -అడ్దుకొని- ఆపివేయుచున్నది (2)
||నీ వాక్యమే||
3.పాలవంటిది-జుంటి తేనె వంటిది నా జిహ్వకు మహా-మధురమైనది(2)
మేలిమి బంగారుకన్న-మిన్నయైనది రత్నరాసులకన్నా కోరతగినది(2)
||నీ వాక్యమే||
#Worship2026
#ChristianMusic2026
#NewWorshipSongs2026
#BestChristianSongs2026
#TopWorshipSongs2026
0 Comments