కళ్యాణం కమనీయం | Kalyanam kamaneeyam

కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం (2)

దేవా రావయ్య నీ దీవెనలీవయ్యా (2)
|| కళ్యాణం ||

1. ఏదేను వనమున యెహోవా దేవా
మొదటి వివాహము చేసితివి (2)
ఈ శుభదినమున నవ దంపతులను (2)
నీ దీవేనలతో నింపుమయ్యా
|| దేవా ||

2. కానా విందులో అక్కరనెరిగి నీళ్లను రసముగ మార్చితివే (2)
కష్టములలో నీవే అండగా నుండి (2)
కొరతలు తీర్చి నడుపుమయ్యా
|| దేవా ||

3. బుద్దియు జ్ఞానము సంపదలన్నియు గుప్తమైయున్నవి నీయందే (2)
ఇహపర సుఖములు మెండుగ నొసగి (2)
ఇల వర్ధిల్లగ చేయుమయ్యా
|| దేవా || 


#Worship2026
#ChristianMusic2026
#NewWorshipSongs2026
#BestChristianSongs2026
#TopWorshipSongs2026

Post a Comment

0 Comments