ప్రియమైన యేసయ్య ప్రేమకే రూపమా | priyamaina yeasayya premake rupama

Lyricist: Rev David Vijayaraju
Album: Krupagala yesayya
Singer: Jonah Samuel


ప్రియమైన యేసయ్య ప్రేమకే రూపమా 
ప్రియమార నిన్ను చూడనీ
ప్రియమైన యేసుయ్య ప్రేమకే రూపమా ప్రియమైన నీతో ఉండనీ (2) 
నా ప్రియుడా యేసుయ్యా ఆశతో ఉన్ననాయ్యా
ఆనందము సంతోషము నీవేనయ్యా
ఆశ్చర్యము నీ ప్రేమయే నా యెడ (2) 
||ప్రియమైన||

1.జుంటి తేనె ధారల కన్నా మధురమైన నీ ప్రేమను
అతి సుందరమైన నీ రూపును మరవలేను దేవా (2)
|| నాప్రియుడా||

2.ఎంతగానో వేచియుంటిని ఎవరు చూపని ప్రేమకై
ఎదుట నీవే హృదిలో నీవే నా మనుసులోన నీవే (2)
|| నా ప్రియుడా||

3.ఏదో తెలియని వేదన ఎదలో నిండెను నా ప్రియా
పదములు చాలని ప్రేమకై పరితపించె హృదయం (2) 
||నా ప్రియడా||

Post a Comment

0 Comments