Album:Sadayuda
సుమధుర స్వరముల గానాలతో
వేలాది దూతల గళములతో
కొనియాడబడుచున్న నా యేసయ్యా
నీకే నా ఆరాధన (2)
మహదానందమే నాలో పరవశమే
నిన్ను స్తుతించిన ప్రతీక్షణం (2)
|| సుమధుర ||
1. ఎడారి త్రోవలో నే నడచినా
ఎరుగని మార్గములో నను నడిపినా
నా ముందు నడచిన జయవీరుడా నా విజయ సంకేతమా (2)
నీవే నీవే నా ఆనందము
నీవే నీవే నా ఆధారము (2)
|| సుమధుర ||
2. సంపూర్ణమైన నీ చిత్తమే
అనుకూలమైన సంకల్పమే
జరిగించుచున్నావు నను విడువక నా ధైర్యము నీవేగా (2)
నీవే నీవే నా జయగీతము
నీవే నీవే నా స్తుతిగీతము (2)
|| సుమధుర ||
3. వేలాది నదులన్ని నీ మహిమను
తరంగపు పొంగులు నీ బలమును
పర్వత శ్రేణులు నీ కీర్తినే
ప్రకటించుచున్నవేగా (2)
నీవే నీవే నా అతిశయము
నీకే నీకే నా ఆరాధన (2)
|| సుమధుర ||
#Worship2026
#ChristianMusic2026
#NewWorshipSongs2026
#BestChristianSongs2026
#TopWorshipSongs2026
0 Comments