ఊహించలేని మేలులతో నింపిన
నా యేసయ్యా నీకే నా స్తోత్రము (2)
వర్ణించగలనా నీ కార్యముల్
వివరించగలనా నీ మేలులన్ (2)
|| ఊహించలేని ||
1. మేలులతో నా హృదయం తృప్తిపరచినావు
రక్షణ పాత్రనిచ్చి నిన్ను స్తుతియింతును (2)
ఇశ్రాయేలు దేవుడా నా రక్షకా
స్తుతియింతును నీ నామమును (2)
|| ఊహించలేని ||
2. నా దీన స్థితిని నీవు మార్చినావు
నా జీవితానికి విలువనిచ్చినావు (2)
నీ కృపకు నన్ను ఆహ్వనించినావు
నీ సన్నిధిని నాకు తోడునిచ్చావు (2)
|| ఊహించలేని ||
#Worship2026
#ChristianMusic2026
#NewWorshipSongs2026
#BestChristianSongs2026
#TopWorshipSongs2026
0 Comments