మేలు చేయక నీవు ఉండలేవయ్యా
ఆరాధించక నేను ఉండలేనయ్యా (2)
యేసయ్యా యేసయ్యా
యేసయ్యా యేసయ్యా (2)
|| మేలు చేయక ||
1. నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మాలేదయ్యా
నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక (2)
నా ఆనందం కోరేవాడా నా ఆశలు తీర్చేవాడా (2)
క్రియలున్న ప్రేమ నీది నిజమైన ధన్యత నాది
|| యేసయ్యా ||
2. ఆరాధించే వేళలందు నీదు హస్తములు తాకాయి నన్ను
పశ్చాత్తపం కలిగే నాలో నేను పాపినని గ్రహియించగానే (2)
నీ మేళ్లకు అలవాటయ్యి నీ పాదముల్ వదలకింటిన్ (2)
నీ కిష్టమైన దారి కనుగొంటిని నీతో చేరి
|| యేసయ్యా ||
3. పాపములు చేసాను నేను నీ ముందర నా తల ఎత్తలేను
క్షమియించ గల్గె నీ మనసు ఓదార్చింది నా ఆరాధనలో (2)
నా హృదయము నీతో అంది నీకు వేరై మనలేనని (2)
అతిశయించెద నిత్యమూ నిన్నే కలిగి ఉన్నందుకు
|| యేసయ్యా ||
#Worship2026
#ChristianMusic2026
#NewWorshipSongs2026
#BestChristianSongs2026
#TopWorshipSongs2026
0 Comments