అసామానుడైన వాడు | Asamanudaina vadu

అసామానుడైన వాడు అవమానపరచబడునిన్ను
ఓటమి ఎరుగనీ మన దేవుడు ఒడిపోనివ్వడు నిన్ను
ఘనకార్యాలెన్నో నీకై చేసినవాడు కష్టకాలమందు
నీ చేయి విడచునా 
అసాధ్యములెన్నో దాటించిన నాథుడు 
శ్రమలో నిన్ను దాటిపోవునా
సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు
కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడచును

1.అగ్ని గుండాములో నెట్టివేసిన సింహాల నోటికి
నిన్ను అప్పగించిన 
శత్రువే నీ స్థితిచూసి అతిశయ పడుచున్న సింహాలే నీ ఎదుటే మ్రింగివేయ నిలిచిన 
నాకే ఎలా శ్రమలంటూ కృంగిపోకుమా
తేరిచూడు యేసుని అగ్నిలో నిలిచెను నీకై
శుత్రువు చేతికి నిను అప్పగించడు

2.పరిస్థితులన్నీ చేజారిపోయిన ఎంతగానో 
శ్రమమపడిన ఫలితమే లేకున్నా
అనుకున్నవన్నీ దూరమ్రైపోయిన
మంచిరోజులొస్తాయనే నిరిక్షణే లేకున్నా
మారదీ తలరాతని దిగులుపడకుమా
మారాను మధురముగా మార్చును నీకై
మేలులతో నిను తృప్తిపరచును

Post a Comment

0 Comments