నాదంటూ ఏమి లేదయ్య
ఈ పాపి క్షేమంకై ఆ ప్రాణ త్యాగమా
నీ ప్రేమ చాలు నాకు తీరని ఓ ఋణమా..
ఈ జీవితం నీదయ్యా నాదంటూ ఏమి లేదయ్య...
1.తీరమే దూరమై భారమే చేరువై
మమతాలే మాయమై మౌనమే స్నేహమైనా
నాతోడు నీవైన్నావు కేడెమై నడిపించావు..
ఈ జీవితం నీదయ్య
నాదంటూ ఏమి లేదయ్య
2 యోగ్యతే లేని నాపై భాద్యతను చూపావు
శ్రమలందు చేయి విడువక శ్రద్దగా నను దాచావు
వేచియున్న కన్నీటికి దాచియున్న దీవెనలొసగే నా కన్న తండ్రి నీవయ్య...
నీవుంటే కొదువే లేదయ్య....
3.ప్రళయమంటి శత్రుమూఖలు చుట్టి నన్ను
ఆవరించగా
స్థిరము అనుకున్న ఆప్తులు కరము విడిచి నన్ను త్రోయగా
నీవు కలుగజేసుకున్నావు..
దారి చూపి నెమ్మదినిచ్చావు..
ఏ ప్రేమ సరిరాదయ్య..
నీ సాక్షిని నేనే యేసయ్య...
0 Comments