చేయి పట్టుకో నా చేయి పట్టుకో 
జారిపోకుండా నే నా పడిపోకుండా
యేసు నా చేయి పట్టుకో (2) ||చేయి||

1.కృంగిన వేళ ఓదార్పు నీవేగా (2)
నను ధైర్యపరచు నా తోడు నీవేగా (2)
మరువగలనా నీ మధుర ప్రేమను
యేసు నా జీవితాంతము (2)
యేసు నా జీవితాంతము   || చేయి||

2.శోధన బాధలు ఎన్నెన్నో కలిగినా
విశ్వాస నావలో కలకలమే రేగిననూ (2)
విడువగలనా ఒక నిమిషమైననూ
యేసు నా జీవితాంతము (2)
యేసు నా జీవితాంతము.    ||చేయి||

Post a Comment

0 Comments