గుండె చెదరిన కోయిలనై మూగబోయితి(2)
నీ గుండెలో దాచుమా
నీ గూటికే చేర్చుమా (2)
నా ప్రాణమా నా క్షేమము నీవయ్యా
నా క్షేమమా నా ప్రాణము నీవయ్యా
||గూడు||
1.గువ్వలకు గూళ్ళిష్టం కోయిలకు పాటిష్టం
నాకేమో నువ్విష్టం నీ సన్నిధి ఇష్టం(2)
నువ్వంటే ఇష్టం యేసయ్యా
నువ్వు లేకుంటే బ్రతుకే కష్టమయ్యా (2)
||నా ప్రాణమా||
2.చేపలకు నీళ్ళిష్టం పిల్లలకు తల్లిష్టం
నీకెమో చెలిమిష్టం నా స్నేహం ఎంతో ఇష్టం(2)
నేనంటే నీకెంతో ఇష్టమయ్యా
నీవెంటుంటే ఇంకా ఇష్టమయ్యా (2)
||నా ప్రాణమా||
0 Comments