గమ్యం చేరాలని నీతో ఉండాలని
పగులూ రేయి పరవశించాలని
ఈ నింగి నేలా కనుమరుగైనా
శాశ్వత జీవం పొందాలని
సాగిపోతున్నాను నిన్ను చూడాలని
నిరీక్షిస్తున్నాను నిన్ను చేరాలని (2)
||గమ్యం చేరాలని||

1.భువి అంతా తిరిగి జగమంతా నడచి
నీ జ్ఞానముకు స్పందించాలని
నాకున్నవన్ని సమస్తం వెచ్చించి
నీ ప్రేమ ఎంతో కొలవాలని
అది ఎంత ఎత్తున ఉందో అది ఎంత
లోతున ఉందో
అది ఏ రూపంలో ఉందో అది ఏ మాటల్లో 
ఉందో     || సాగిపోతున్నాను||

2.అలలెన్నో రేగినా శ్రమలెన్నో వచ్చినా
శిరమును వంచి సహించాలని
వేదన బాధలు గుండెను పిండినా
నీదు సిలువనే మోయాలని
నాగుండె కోవెలలోనా నిన్నేనే ప్రతిష్టించి
నీ సేవలోనే ఇలలో నా తుది శ్వాసను
విడవాలని   ||సాగిపోతున్నాను||

Post a Comment

0 Comments