తల్లిలా లాలించును తండ్రిలా ప్రేమించును(2)
ముదిమి వచ్చువరకు ఎత్తుకొని ముద్దాడును
చంక పెట్టుకొని కాపాడును యేసయ్యా
||తల్లిలా||

1.తల్లి అయిన మరచునేమో నేను నిన్ను
మరువను
చూడుము నా అరచేతులలో
నిన్ను చెక్కియున్నాను (2)
నీపాదము తొట్రిల్లనీయను నేను
నిన్ను కాపాడువాడు కునుకడు నిదురపోడు
అని చెప్పి వాగ్దానం చేసిన యేస్యయ్యా || తల్లిలా||

2.పర్వతాలు తొలగచ్చు తత్తరిల్లు మెట్టలన్నీ
వీడిపోదు నా కృప నీకు
నా నిబంధనా తొలగదు (2)
దిగులుపడకు భయపడకు నిన్ను
విమోచించెద
నీదు భారమంతా మోసి నాడు శాంతి 
నొసగెద
అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్య ||తల్లిలా||

Post a Comment

0 Comments