ఏ పాపమెరుగని యో పావన మూర్తి పాప
విమోచకుండా
నా పాలి దైవమా నా పాపముల కొర కీ పాట్లు 
నొందినావా

1.ముళ్ళతోకీరీట మల్లి నీ శిరముపై
జల్లాటమున మొత్తిరా
ముళ్ళ పోట్లకు శిరము తల్లడిల్లగ సోమ్మ సిల్లిపోతవ
రక్షకా ||ఏ పాప||

2.కలువరి గిరి దనుక సిలువ మోయలేక
కలవరము నొందినావా
సిలువ నీతో మోయ తులువలు వేరొకని 
తోడుగా నిచ్చినారా ||ఏ పాప||

3.చెడుగు యూదులు బెట్టు పడరాని పాట్లకు
సుడివడి నడచినావా
కడకు కల్వరి గిరి కడ కేగి సిల్వను 
గ్రక్కున దించినావా ||ఏపాప||

4.ఆకాల కర్ములు భీకరంబుగ నిన్ను ఆ
కొయ్యపై నుంచిరా
నీకాలు సేతులు ఆకొయ్యకే సూది
మేకులతో గ్రుచ్చినారా ||ఏపాప||

5.పలువిధంబుల శ్రమలు చెలరేగ దండ్రికి
నెలుగెత్తి మొరలిడితివా
సిలువపై పలుమారు కలుగుచుండెడి బాధ వలన 
దాహము నాయెనా ||ఏపాప||

6.బల్లిదుండగు బంటు బల్లెమున నీ ప్రక్కు
జిల్లి బడ బొడచినాడా
ఉల్లోలములవలె నల్ల నీరుబుకంగ జల్లారె
గద కోపము ||ఏపాప||

7.కట కటా పాప సం కటము బాపుట కింతపటు
బాధ నొందినావా
ఎటువంటిదీ ప్రేమ యెటువంటిదీ శాంత
మెటుల వర్ణింతు స్వామి ||ఏపాప||

Post a Comment

0 Comments