నీ రక్తమే నీ రక్తమే నన్ శుద్దీకరించున్
నీ రక్తమే నా బలము (2)

నీ రక్త ధారలే ఇల
పాపికాశ్రయంబిచ్చును(2)
పరిశుద్ధ తండ్రి పాపిని
కడిగి పవిత్ర పరుచుము (2) ||నీ రక్తమే||

నశించు వారికి నీ సిలువ
వెర్రితనముగ నున్నది(2)
రక్షింపబడుచున్న పాపికి
దేవుని శక్తియై యున్నది(2) ||నీ రక్తమే||

నీ సిల్వలో కార్చినట్టి
విలువైన రక్తముచే(2)
పాప విముక్తి చేసితివి
పరిశుద్ధ దేవ తనయుడా(2) ||నీ రక్తమే||

పంది వలె పొర్లిన నన్ను
కుక్క వలె తిరిగిన నన్ను(2)
ప్రేమతో చేర్చుకొంటివి
ప్రేమార్హ నీకే స్తోత్రము(2) ||నీ రక్తమే|

నన్ను వెంబడించు సైతానున్
నన్ను బెదరించు సైతానున్(2)
దునుమాడేది నీ రక్తమే
దహించేది నీ రక్తమే (2) || నీ రక్తమే||

స్తుతి మహిమ ఘనతయు
యుగయుగంబులకును(2)
స్తుతి పాత్ర నీకే చెల్లును
స్తోత్రార్హుడా నీకే తగును(2) ||నీ రక్తమే|||

Post a Comment

0 Comments