సందేహమేల సంశయమదేల
ప్రభు యేసు గాయములను పరికించి చూడు
గాయాలలో నీ వ్రేలు తాకించి చూడు(2)
||సందేహమేల||

ఆ ముళ్ల మకుటము నీకై ధరియించెనే
నీ పాప శిక్షను తానే భరియించెనే (2)
ప్రవహించె రక్త ధార నీ కోసమే 
కడు ఘొర హింసనొందె నీ కోసమే(2)
||సందేహమేల||

ఎందాక యేసుని నీవు ఎరగనందువు
ఎందాక హృదయము బయట
నిలవమందువు(2)
యేసయ్య ప్రేమ నీకు లోకువాయెనా
యేసయ్య సిలువ సువార్త చులకనాయెనా (2) 
||సందేహమేల||

ఈ లోక భోగములను వీడజాలవా
సాతాను బంధకమందు సంతసింతువా (2)
యేసయ్య సహనముతోనే చెలగాటమా
ఈ నాడు రక్షణ దినము గ్రహియించుమా(2)
||సందేహమేల||

లోకాన ఎవ్వరు నీకై మరణించరు
నీ శిక్షలను భరియింప సహియించరు(2)
నీ తల్లియైన గాని నిన్నుమరచునే
ఆ ప్రేమ మూర్తి నిన్ను మరువజాలువా(2)
||సందేహమేల||

Post a Comment

0 Comments