ఎంతో వింత యెంతో చింత
యేసునధు మరణ మంత (2)
పంతము తో జేసి రంత
సొంత ప్రజలు స్వామి నంత(2) |ఎంతో||

పట్టి కట్టి నెట్టి కొట్టి
తిట్టి రేసు నాధు నకటా (2)
అట్టి శ్రమల నొంది పలుక
డాయె యేసు స్వామి నాడు(2) ||ఎంతో||

మొయ్యలేని మ్రాను నొకటి
మోపి రేసు వీపు పైని(2)
మొయ్యలేక మ్రాని తోడ
మూర్చబోయే నేసు తండ్రి(2) ||ఎంతో||

కొయ్యపై నేసయ్యన్ బెట్టి
కాలు సేతులలో జీలల్(2)
కటిను లంత గూడి కొట్టిరి
ఘొరముగ క్రీస్తేసున్ బట్టి(2) ||ఎంతో||

దాహము గొన చేదు చిరక
ద్రావ నిడిరి ద్రోహు లకటా(2)
ధాత్రి ప్రజల బాధ కోర్చి
ధన్యుడా దివి కేగె నహహా (2) ||ఎంతో||

బల్లెముతో బ్రక్కన్ బొడవన్
పారే నీరు రక్తమహహా(2)
ఏరై పారే యేసు రక్త
మెల్ల ప్రజల కెలమి నొసగు (2) ||ఎంతో||


Post a Comment

0 Comments