రండీ రండీ యేసుని యొద్దకు | Randi Randi yesuni yoddhaku

Lyricist: Unknown 
Album: Songs of Zion


రండీ రండీ యేసుని యొద్దకు-రమ్మనుచున్నాడు

ప్రయాసపడి భారము మొయువారలు
ప్రభుని చెంతుకు పరుగిడి వేగమె

1.యేసుని పిలిపు వినియు నింక యోచింపనేల
అవనిలో అగచాట్లపాలైన - అబ్బదు శాంతి ఆత్మకు నిలలో       
|| రండి ||

2.ప్రభు యేసు నీకొరకై తనదు - ప్రాణము నిచ్చెగదా
సిలువను రక్తము చిందించియును - 
బలియాయెను యా ఘనుడు మనకై  
|| రండి ||

3.యేసుని నామమునందే పరమ - నివాసము దొరుకును
ముక్తిని పాపవిమోచనమును-శక్తిమంతుడు యేసే యిచ్చును   
|| రండి ||

4.నేనే మార్గము నేనే సత్యమును-నేనే జీవమును
నేనే గాకింకెవరు లేరని - ఎంచి చెప్పిన యేసుని యొద్దకు   
|| రండి ||

5.హల్లేలూయ హల్లేలూయ-హల్లేలూయ
ఆమేన్
హల్లేలూయ హల్లేలూయ -హల్లేలూయ
హల్లేలూయ.       
|| రండి ||


Post a Comment

0 Comments