రండి యుత్సహించి పాడుదము | Randi yusthahinchi paadudhamu

Lyricist: B.M.J Dhyriam
Album: Andhra Kraisthava Keerthanalu


రండి యుత్సహించి పాడుదము - రక్షణ
దుర్గము మన ప్రభువే (2)

1.రండి కృతజ్ఞత స్తొత్రముతో-రారాజు
సన్నిధి కేగుదుము
సత్పభు నామము కీర్తనలన్-సంతోష గానము 
చేయుదము  
||రండి ||

2.మన ప్రభువే మహా దేవుండు-ఘన
మహాత్మ్యము గల రాజు
భుమ్యగాధపు లోయలును-భుధర శిఖరము
లాయనవే  
|| రండి ||

3.సముద్రము సృష్టించె నాయనదే-సత్యుని
హస్తమే భువి జేసెన్
ఆయన దైవము పాలితుల -మాయన మేపెడి గొర్రలము 
|| రండి ||

4.ఆ ప్రభు సన్నిధి మోకరించి-ఆయన
ముందర మ్రొక్కుదము
ఆయన మాటలు గైకొనిన-నయ్యవి మనకెంతో
మేలగును  
|| రండి ||

5.తండ్రి కుమార శుద్ధాత్మకును -దగు స్తుతి
మహిమలు కల్గుగాక 
ఆదిని నిప్పుడు నెల్లప్పుడు-నయినట్లు యుగముల
నౌను ఆమేన్  
||రండి ||

Post a Comment

0 Comments