Lyricist: unknown
నే సాగెద యేసునితో-నా జీవిత కాలమంతా (2)
1.యేసుతో నడిచెద -యేసుతో గడిపెద (2)
పరమున చేరగ-నే వెళ్లెద (2)
హనోకు వలె సాగెదా..
|| నే సాగెద ||
2.వెనుక శత్రువులు-వెంటాడినను (2)
ముందు సముద్రము-ఎదురొచ్చినా (2)
మోషే వలె సాగదా....
|| నే సాగెద||
3.లోకపు శ్రమలు-నన్నెదిరించిన (2)
కఠినులు రాళ్ళతో -హింసించినా (2)
స్తెఫను వలె సాగెదా...
|| నే సాగెద ||
4. తల్లి మరచిన-తండ్రి విడచినా (2)
బంధువులే నన్ను -వెలివేసినా (2)
బలవంతుని వలె సాగెదా...
|| నే సాగెద ||
5.బ్రతుకుట క్రీస్తే- చావైనా మేలే (2)
క్రీస్తుకై హతసాక్షిగా మారినా (2)
పౌలువలె సాగెదా...
|| నే సాగెద ||
0 Comments