నూతన పరుచుము దేవా | Noothana parachumu devaa


Lyricist: Sis. Glory Rangarajan
Album: Thrupthi parachumu deva

నూతన పరుచుము దేవా
నీ కార్యములు నా యెడల (2)
సంవత్సరాలెన్నో జరుగుచున్నను
నూతనపరుచుము నా సమస్తము (2)

పాతవి గతించిపొవును-సమస్తం నూతనమగును 
నీలో ఉత్సహించుచు-నీకై ఎదురు చూతును 
|| నూతన ||

1.శాశ్వతమైనది నీదు ప్రేమ
ఎన్నడైన మారనిది నీదు ప్రేమ (2) 
దినములు గడచినా సంవత్సరాలెన్ని దొర్లినా
నా యెడ నీదు ప్రేమ నిత్యం నూతనమే (2)
|| పాతవి ||

2.ప్రతి ఉదయం నీ వాత్సల్యముతో
నన్ను ఎదుర్కొందువు నీదు కరుణతో (2)
తరములలో ఇలా సంతోషకారణముగా
నన్నిల చేసినావు నీకే స్తొత్రము (2) 
|| పాతవి ||

Post a Comment

0 Comments